చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల(మం) పెద్ద ఒడ్డు సమీపంలో శనివారం తెల్లవారుజామున చెరువు కట్టపై నుంచి జారి పడి ఏనుగు మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం పాతపేట అటవీ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయని, అనంతరం అర్ధరాత్రి కల్లూరు సమీపంలోకి ఏనుగుల గుంపు వచ్చిందని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa