తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం సెమ్మంగుప్పం సమీపంలో పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. 12 మంది పిల్లలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైలు ఢీకొనడంతో వ్యాను 50 మీటర్ల దూరంలో ఎగిరిపడి నుజ్జునుజ్జయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa