కృష్ణా జిల్లా పామర్ర మండలం కురుమద్దాలి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై పిల్లలను తండ్రి స్కూల్‌కు తీసుకెళ్తుండగా.. వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి జోయల్ 915) మృతి చెందగా.. సోదరుడు అభి, తండ్రికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa