ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను బీజెపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురు కూటమి కార్యాచరణ, ప్రభుత్వంలో భాగస్వామ్యం, రాజకీయ సమన్వయంపై చర్చించారు. జనసేన–బీజేపీ మిత్రపక్షాల మధ్య సమన్వయం పెంచే దిశగా చర్చలు జరిగినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa