రాత్రి పూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం అనేది కామన్ ప్రాబ్లమ్. కానీ, దీని వల్ల నిద్రలేవడం, నిద్ర డిస్టర్బ్ అవ్వడం చాలా సమస్యల్ని తీసుకొస్తుంది. ఒక్కసారి నిద్రలేచాక తిరిగి నిద్రపోవడానికి చాలా టైమ్ పడుతుంది. సరిగా నిద్రపట్టదు. ఇలాంటివన్నీ నిద్రని దూరం చేయడమే కాకుండా మరుసటి రోజుని క్వాలిటీని తగ్గిస్తాయి. సరిగ్గా పని చేయలేరు. ఏ పనిపైన కాన్సంట్రేట్ చేయలేరు. ఇన్ని ప్రాబ్లమ్స్‌కి కారణమైన రాత్రుళ్లు ఫ్రీక్వెంట్ యూరినేషన్‌కి చెక్ పెట్టేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి.
ఎక్కువసార్లు మూత్ర విసర్జనకి చాలానే కారణాలు ఉన్నాయి. అవి
ఎక్కువగా నీరు తాగడం
కెఫిన్ తీసుకోవడం
మూత్రనాళాల ఇన్ఫెక్షన్(యూటిఐ)
షుగర్
ప్రొస్టేట్ సమస్యలు
బలహీనమైన మూత్రాశయం
హార్మోన్ల మార్పులు
సమస్యని తగ్గించుకునేందుకు ఏం చేయాలంటే
సాక్స్ వేసుకోవడం
వయసు పెరిగేకొద్దీ కాళ్లలోని సిరల బలహీనపడతాయి. దీని వల్ల కాళ్లలో ద్రవం నిలుదల ఉంటుంది. పడుకున్నప్పుడు దిగువ కాళ్లలోని ద్రవం సిరల్లోకి తిరిగి బ్యాలెన్స్ అవుతుంది. దీని వల్ల రాత్రిపూట మూత్రపిండాల ద్వారా మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. రాత్రుళ్లు ద్రవాలు తీసుకోకపోయినా, నిండిన మూత్రాశయానికి దారితీస్తుంది. దీంతో పాదాలు వాపుగా ఉంటాయి. దీనిని కంట్రోల్ చేయడానికి మోకాలి వరకూ ఉన్న కంప్రెషన్ సాక్స్‌లు వేసుకోండి. వీటి వల్ల ఒత్తిడి ద్రవం, వాపు తగ్గుతుంది. సిరల ద్వారా గుండెకి రక్త ప్రవాహం పెరుగుతుంది. దీని వల్ల ఎక్కువ సార్లు మూత్ర విసర్జన జరగదు.
సాయంత్రాలు లిక్విడ్స్ తగ్గించడం
రాత్రుళ్లు ఎక్కువగా మూత్ర విసర్జన జరగకుండా ఉండేందుకు సాయంత్రం నుంచి లిక్విడ్స్ తగ్గించాలి. ముఖ్యంగా, రాత్రి పడుకునే 2 నుంచి 3 గంటల ముందు నీరు, టీ, కాఫీలు తగ్గించాలి. దీని వల్ల శరీరంలో ఎక్కువగా నీరు చేరదు. మూత్రాశయం త్వరగా నిండదు. తరచుగా మూత్రం రాదు. ముఖ్యంగా వయసుపెరిగిన వారిలో మూత్రపిండాల పనితీరు చురుగ్గా ఉండి ఎక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగానే ఎక్కువగా మూత్రం వస్తుంది. దీనిని తగ్గించుకునేందుకు తక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి. దాహం వేస్తే కొద్దిగా మాత్రమే తీసుకోవాలి.
కొన్నింటికి దూరంగా
కెఫిన్ ఉండే డ్రింక్స్‌ని తగ్గించాలి. కాఫీ, టీలు, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్స్‌ని తగ్గించాలి. దీని వల్ల మూత్రాశయంపై ఎఫెక్ట్ పడతాయి. ఈ కారణంగా ఎక్కువగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన మందుల్లా పనిచేస్తాయి. కాబట్టి, నిద్రపోయే ముందు వీటిని తగ్గించాలి. సమస్యని ఉదయం కూడా కంట్రోల్ చేసేందుకు వీటిని తగ్గిస్తే మంచిది.
వర్కౌట్స్
మూత్రం వచ్చినప్పుడల్లా వెంటనే మూత్ర విసర్జన వెళ్లకుండా కొద్దిగా హోల్డ్ చేయండి. దీనినే బ్లాడర్ ట్రైనింగ్ అంటారు. దీని వల్ల క్రమంగా మూత్రాశయం యొక్క నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎక్కువసార్లు మూత్రం వెళ్లేవారికి ఇది హెల్ప్ అవుతుంది.
కెగెల్ వర్కౌట్స్
కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, పెల్విక్ ఫ్లోర్ కండరాలని బలంగా చేస్తాయి. ఈ కండరాలు మూత్రాన్ని ఆపడానికి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. వృద్ధాప్యం, గర్భం, ఇతర సమస్యల కారణంగా బలహీనమైన కండరాలని కెగెల్ వర్కౌట్స్ బలంగా మారుస్తాయి. దీని వల్ల మూత్రాశయం యొక్క పట్టు బలంగా మారి మూత్ర నియంత్రణ మెరుగ్గా మారుతుంది.
ఇంటి చిట్కాలు
ధనియాల నీరు: ధనియాలని నానబెట్టిన నీరు లేదా గ్లాస్ నీటిలో ఓ స్పూన్ ధనియాలు వేసి మరిగించి ఆ నీటిని తాగండి. దీని వల్ల కూడా చాలా వరకూ సమస్య తగ్గుతుంది.
ఉసిరి, తేనె : ఈ రెండింటి కాంబినేషన్ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా మూత్రాశయాన్ని బలాన్ని కూడా పెంచుతుంది.
అశ్వగంధ : ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మూత్రాశయ కండరాలని బలంగా చేస్తుంది.
దానిమ్మ తొక్క పొడి : ఇది మూత్రాశయాన్ని టోన్ చేసి నియంత్రణని పెంచుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa