AP: నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాని అనే వ్యక్తి బస్సు క్యాబిన్‌లో ఇరుక్కొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa