చిలకడదుంపలు రుచికరమైనవే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలైనవి. ఇవి పోషక విలువలతో నిండి ఉండటంతో శరీరానికి ఎనర్జీతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా ఇస్తాయి.చిలకడదుంపల ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..శక్తిని ఇస్తుంది: కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వ్యాయామం చేసే వారి కోసం ఇది మంచి ఆహారం.జీర్ణవ్యవస్థకు మేలు : చిలకడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.మధుమేహ నియంత్రణలో సహకారం: చిలకడదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది.విషపదార్థాల నివారణ : ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌కి విరుద్ధంగా పనిచేసి క్యాన్సర్ వంటి జబ్బులను నిరోధిస్తాడు.మెరుగైన కళ్ల ఆరోగ్యం : చిలకడదుంపలో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది విటమిన్ Aగా మారి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.రక్తపోటు నివారణ: ఇందులో ఉన్న పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చర్మం, జుట్టు ఆరోగ్యానికి తోడ్పాటు: విటమిన్ C, విటమిన్ E వంటి విటమిన్లు చర్మం మెరుస్తూ ఉండేందుకు, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.చిలకడదుంపలను మితంగా తీసుకోవడం ఉత్తమం. వాటిని ఆయిల్‌లో వేపితే పోషక విలువలు తగ్గిపోవచ్చు, కాబట్టి ఉడికించి లేదా స్టీమ్ చేసి తినడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa