భారత సైన్యం మరిన్ని శక్తివంతమైన ఆయుధాలతో మరింత బలోపేతం కానుంది. రాబోయే రెండు మూడు వారాల్లో ఇండో రష్యన్ భాగస్వామ్యంతో తయారవుతున్న ఏకే 203 తుపాకులు సైన్యంలో చేరనున్నాయి. ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సైనికులకు 7 వేల కలాప్నికోవ్ రకం రైఫిళ్లు అందించనున్నారు. ఇప్పటివరకు 48 వేల ఏకే 203 తుపాకులు సైన్యంలోకి వచ్చాయి. 2026 నాటికి లక్ష యూనిట్లు, 2030 నాటికి ఆరు లక్షల తుపాకులు అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa