కిస్‌మిస్ నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కిస్‌మిస్ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు రాత్రిపూట కిస్‌మిస్‌లను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది. చర్మం ఆరోగ్యంగా మారుతుంది. కిస్‌మిస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa