పాకిస్థాన్ తన గగనతలాన్ని ఉపయోగించి భారత్ నడిపే విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు భారత ఎయిర్‌లైన్స్‌పై బ్యాన్‌ను పొడిగించినట్లు పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ (పీఏఏ) తాజాగా ప్రకటించింది. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలన్నింటికీ వర్తిస్తుందని తెలిపింది. శుక్రవారం జారీ చేసిన నోటామ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) మధ్యాహ్నం 3:50 గంటలకు అమల్లోకి వచ్చింది. ఈ కొత్త నిషేధం ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు అమలులో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa