వినియోగదారులకు పోస్టల్ డిపార్టుమెంట్ గుడ్ న్యూస్ వినిపించింది. ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించనుంది. జూలై 22 నుంచి వినియోగదారులకు ఇంటి వద్ద నుంచి రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ సేవలను తపాలా శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఇప్పటి వరకూ స్పీడ్ పోస్టు , రిజిస్టర్ పోస్టులాంటివి చేయాలంటే కచ్చితంగా పోస్టాఫీసులకు వెళ్లాల్సి ఉండేది. అయితే జూలై 22 నుంచి ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్టు బుకింగ్ సేవలు అందించనుంది. ఆ రోజు నుంచి పోస్టాఫీసు సిబ్బంది ఇళ్ల వద్దకే వెళ్లి.. రిజిస్టర్ పోస్టులు స్వీకరించనున్నారు. ఇందుకోసం తపాలా శాఖ కసరత్తు జరుపుతోంది. అందులో భాగంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0లో భాగంగా ఒక ప్రత్యేకమైన యాప్ అందుబాటులోకి తెస్తోంది.
రిజిస్టర్ పోస్ట్ పంపాల్సిన వినియోగదారులు ఈ ప్రత్యేకమైన యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేవల కోసం తపాలా శాఖ సిబ్బందికి అభ్యర్థన పంపాల్సి ఉంటుంది. ఆ రిక్వె్స్ట్ మేరకు సేవలందించేలా పోస్టల్ డిపార్టుమెంట్ సిబ్బంది చర్యలు తీసుకుంటారు. మరోవైపు 5 వందల రూపాయలు లోపు విలువైన ఆర్టికల్స్‌ను రిజిస్టర్, స్పీడ్ పోస్టులో పంపాలనుకునే వినియోగదారులు తొలుత వాట్సప్ ద్వారా పోస్టల్ సిబ్బందికి సమాచారమివ్వాలి. ఆ తర్వాత వినియోగదారుడి ఫోన్‌కు ఓ ప్రత్యేకమైన బార్‌కోడ్ నంబరు, అలాగే ఓటీపీ పంపుతారు. అనంతరం రిజిస్టర్ పోస్టు కోసం ఇంటికి వచ్చే తపాలా శాఖ సిబ్బంది వద్ద ఈ బార్‌కోడ్, ఓటీపీ వివరాలు సరిచూసుకోవాలి. రెండూ మ్యాచ్ అయితే తపాలా సిబ్బందికి ఆర్టికల్స్ అందజేయాలి.
అయితే రూ.500 లోపు విలువైన వస్తువులు/ ఆర్టికల్స్ రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు చేయాలంటే ఎలాంటి సర్వీస్ ఛార్జ్ అవసరం లేదు. ఒకవేళ రిజిస్టర్ పోస్టు చేసే ఆర్టికల్స్ విలువ రూ.500కు పైగా ఉంటే వాటికి మాత్రం నిర్దేశించిన మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తపాలా శాఖ సిబ్బంది తెలిపారు. మరోవైపు అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0లో భాగంగా పోస్టల్ డిపార్టుమెంట్.. క్లౌడ్ టెక్నాలజీకి ప్రస్తుత డేటాను అనుసంధానిస్తోంది. ఈ నేపథ్యంలో జూలై 21న పోస్టల్ సేవలు అందుబాటులో ఉండవు.
మరోవైపు ప్రస్తుతం రిజిస్టర్ పోస్టు చేయాలంటా పోస్టాఫీసుకు వెళ్లి.. రిజిస్టర్ పోస్టు బుకింగ్ ఫారమ్‌ను పూరించాలి. ఇందులో పంపినవారితోపాటుగా స్వీకర్త పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత రిజిస్టర్ పోస్టు చేస్తున్న పార్శిల్ బరువు, గమ్యస్థానం ఆధారంగా ఛార్జీలు నిర్ణయిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa