రాష్ట్రంలోని వంద పడకల ప్రభుత్వ బోధనాసుపత్రులను అవయవమార్పిడి కేంద్రాలుగా గుర్తించేలా, ఆ హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2016లో దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2016లో పిల్ దాఖలైతే ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవమార్పిడికి అవకాశం కల్పించడం ద్వారా అవయవమార్పిడి ముఠాలను కట్టడి చేయవచ్చని పేర్కొంటూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa