ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో మళ్లీ సింగపూర్ నిర్మాణాలు.. టూర్‌కి సిద్ధమైన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 06:25 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే సింగపూర్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఏపీ సచివాలయంలో గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని నేరుగా ఆయనే స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ హయంలో సింగపూర్‌పై దుష్ర్పచారం చేయడంతో పాటు, అక్కడి మంత్రులపై కూడా తప్పుడు ఆరోపణలు చేశారు. సింగపూర్‌తో సంబంధాలు పునరుద్ధరణకు ఈ టూర్ బాగా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.


అమరావతి నిర్మాణంలో మళ్లీ సింగపూర్ భాగస్వామ్యం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నవ్యాంధ్రలో టీడీపీ రెండోసారి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ సింగపూర్ వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు.. రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో ఆవిష్కరించడంలో ఈ పర్యటన ఉపయోగపడుతుందన్నారు.


ఐదు రోజుల పర్యటనలో భాగంగా జూలై 27న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ వద్ద ఎన్ఆర్ఐలతో తొలుత సమావేశం నిర్వహించనున్నారు. విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి వారిని వివరిస్తారు. ఈ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నారాయణ, నారా లోకేశ్, టీజీ భరత్ ఎన్ఆర్ఐ సమావేశంలో పాల్గొననున్నారు.


ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లిక్కర్ కేసు, వైఎస్సార్‌సీ నేతలకు కౌంటర్లు, సుపరిపాలనపై తొలుత మంత్రివర్గం చర్చించింది. ఆ తర్వాత మొత్తం 42 అజెండా అంశాలపై చర్చ కొనసాగింది. ఎల్ఆర్ఎస్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్, ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్డీఏ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపుపై కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.


గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్‌కు కూడా ఆమోదం తెలిపింది. నవంబర్‌లో 8 క్వి, బిట్ క్వాంటం కంప్యూటర్ ఆవిష్కరించునున్నట్లు సీఎం తెలిపారు. ఈ టెక్నాలజీని దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఆవిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది వేసిన క్వాంటం మిషన్‌కు సీఎం ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa