బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది తమ ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇంకొందరికి సమయం దొరకడం లేదు. ఈ నిర్లక్ష్యం కారణంగా చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. బరువు పెరగడంతో పాటు మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇక, సగానికి పైగా ఊబకాయం సమస్యతో సఫర్ అవుతున్నారు. దీంతో, చాలా మంది బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరి తిండిలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు.
ఇక, బరువు తగ్గడానికి ఈజీ మార్గం వాకింగ్. నడక వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందులోనూ రోజుకు 10 వేల అడుగులు నడిస్తే బరువు తగ్గుతారని నిపుణులు అంటారు. అయితే, చాలా మందికి సరైన సమయం దొరక్క రోజుకు 10 వేల అడుగులు నడవడం లేదు. అలాంటి వారికి కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. ఇంట్లోనే కాస్త సమయం కేటాయిస్తే మీరు బరువు తగ్గడం ఖాయమంటున్నారు నిపుణులు. ఇంట్లో ఏం చేస్తే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి పనులు చేయండి
పదివేల అడుగులు నడవడానికి సమయం లేనివారు.. ఇంటి పనుల ద్వారా బరువు తగ్గవచ్చు. ఇంటి పనులు కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అవి మీ ఫిట్‌నెస్ మెరుగుపర్చడంలో సాయపడతాయి. ప్రతి రోజూ ఇంటిని క్లీన్ చేసుకోవడం అంటే ఊడవడం, తుడవడం లాంటి పనులు చేయండి. అంతేకాకుండా బట్టలు ఉతకడం, వాక్యూమ్ క్లీనర్‌తో ఇంటిని శుభ్రం చేయడం పనులు చేయడం వల్ల కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. ఇలా చేయడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది ఇల్లు శుభ్రం అవుతుంది. రెండోది బరువు తగ్గడంతో పాటు మీ ఆరోగ్యం కూడా మెరగవుతుంది.
డెస్క్ వ్యాయామాలు
ఇది ఆఫీస్‌ల్లో వర్క్ చేస్తూ బిజీ లైఫ్‌స్టైల్ గడిపేవారికి బెస్ట్ ఆప్షన్. మీరు ఆఫీసులో కుర్చీపై కూర్చుని ఎక్కువసేపు పనిచేసినా, మిమ్మల్ని మీరు చురుకుగా ఉంచుకోవచ్చు. కుర్చీ స్క్వాట్‌లు, కాళ్లను పైకి కిందికి కదిలించడం లేదా భుజాలను తిప్పడం వంటి చిన్న వ్యాయామాలు కేలరీల్ని బర్న్ చేయడంలో సాయపడతాయి. ఈ వ్యాయామాలు మీ సీటులోనే కూర్చుని చేసుకోవచ్చు. ఈ వ్యాయామాలు మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్, బరువు పెరగడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
డ్యాన్స్
మీరు వింటున్నది నిజమే. డ్యాన్స్‌తో కూడా కేలరీలు బర్న్ చేయవచ్చు. మీరు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినప్పుడల్లా, కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది రోజులోని బిజీ షెడ్యూల్ తర్వాత ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, కేలరీలను బర్న్ చేయడంలో కూడా సాయపడుతుంది. అంతేకాకుండా మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఇంట్లో కూడా సరదా వాతావరణం నెలకొంటుంది.
మెట్లు ఎక్కడం, దిగడం
ఈ రోజుల్లో చాలా మంది మెట్లు ఎక్కడం, దిగడం మర్చిపోయారు. ప్రతి చిన్న పనికి కూడా లిఫ్ట్ వాడటం మొదలు పెట్టారు. ఆఫీస్, ఇల్లు ఏ ప్లేస్ అయినా సరే లిఫ్ట్ ఉపయోగించే బదులు మెట్లు ఎక్కడం, దిగడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెట్టు ఎక్కడం వల్ల కాళ్ల కండరాలు బలపడతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడతుంది. అంతేకాకుండా కేలరీలు బర్న్ అయి బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది.
ఇంట్లోనే చేసుకునే వ్యాయామాలు
మీకు జిమ్‌కి వెళ్లడానికి సరైన సమయం దొరకడం లేదా, అయితే నో టెన్షన్. ఇంట్లోనే కొన్ని వ్యాయామాలతో కేలరీలు బర్న్ చేయవచ్చు. మీరు ఇంట్లోనే స్క్వాట్‌లు , పుష్-అప్‌లు, వాకింగ్ లంజెస్, ప్లాంక్‌లు వంటి సాధారణ శరీర బరువు వ్యాయామాలు చేయవచ్చు. దీని కోసం మీరు 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే వెచ్చిస్తే సరిపోతుంది. ఈ వ్యాయామాలు మీ శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో సాయపడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa