ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షంలో నడిచేటప్పుడు ప్యాంట్‌పై బురద చిల్లిందా, ఈ చిట్కాతో మాయం

Life style |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 11:28 PM

వర్షాకాలంలో దుస్తులపై మరకలు పడుతుంటాయి. పైగా ఇవి చూడడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక లైట్ కలర్ ప్యాంట్స్ అయితే మరకలు ఇంకా పెద్దగా కనిపిస్తాయి. వాటిని ఉతికినా అంత త్వరగా మరకలు తొలగిపోవు. మరకల వల్ల ప్యాంట్ పాడైపోతుందని మాత్రమే ఆలోచిస్తాం. కానీ..వీటి వల్ల దుర్వాసన కూడా వస్తుంది. ఫంగస్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే..ఈ మరకలు వదలాలంటే ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటించాలి. సరైన పద్ధతిలో ఉతికితేనే అవి పూర్తిగా పోతాయి. మరి ఈ చిట్కాలు ఏంటి. ఏ పదార్థాలు వాడితే ఈ మరకలు త్వరగా తొలగిపోతాయి. వీటిని పాటించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.


ఏం చేయాలి


చాలా మంది చేసే మొదటి పొరపాటు ఏంటంటే..బురద మరక పడగానే వెంటనే చేయితో దాన్ని తుడిచేస్తారు. దీని వల్ల మరక ఇంకాస్త పెద్దగా అవుతుంది. మరక పడిన వెంటనే తుడిచేస్తే త్వరగా పోతుందని అనుకుంటారు. కానీ..బురద పడినప్పుడు అది పూర్తిగా ఎండిపోయేంత వరకూ ఉంచితేనే సులువుగా తొలగించుకోవచ్చు. అలా కాకుండా వెంటనే రబ్ చేయడం వల్ల మట్టి ఇంకాస్త లోతుగా వెళ్లిపోతుంది. అప్పుడు తొలగించడం కష్టమవుతుంది.


మట్టి పూర్తిగా ఎండిపోయిన తరవాత ఓ కత్తి లేదా స్పూన్ తీసుకోవాలి. అయితే..కత్తి మరీ షార్ప్ ది కాకుండా పాతది ఏమైనా ఉంటే వాడాలి. అంటే..షార్ప్ నెస్ తక్కువగా ఉన్నది తీసుకోవాలి. దీనితోనే ఆ మట్టి మరకను క్రమంగా తొలగించాలి. ఇలా చేయడం వల్ల మరక పెద్దగా అవకుండా ఉంటుంది. ఆ తరవాతే మీరు రెగ్యులర్ గా వాడే డిటర్జెంట్ తో ఉతకాలి. అయితే..చిన్న చిన్న మరకలు పడ్డప్పుడు ఈ చిట్కా బాగా పని చేస్తుంది. మరీ ఎక్కువగా ఉంటే మాత్రం మరి కొన్ని టిప్స్ ట్రై చేయొచ్చు.


ఇలా కూడా చేయొచ్చు


కొన్ని సార్లు మరకలు డిటర్జెంట్ పెట్టి ఉతికినా తొలగిపోవు. పైగా దుర్వాసన కూడా వస్తాయి. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పే చిట్కా పాటించవచ్చు. వైట్ వెనిగర్ తో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దుర్వాసన పోగొట్టడంతో పాటు మురికిని కూడా చాలా త్వరగా వదిలించడంలో ఇది చాలా బాగా పని చేస్తుంది. మరకలు పడ్డ డ్రెస్ లను ఓ బకెట్ లో నీళ్లు పోసి అందులో వేయాలి. ఈ బకెట్ లోనే 5 కప్పుల వెనిగర్ పోయాలి. ఇలా కాసేపు నానబెట్టాలి. దీని వల్ల మొండిగా పట్టి ఉన్న మరకలు క్రమంగా తొలగిపోతాయి.


దుర్వాసన కూడా పోతుంది. ఇలా కాకపోతే నేరుగా వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసి అందులోనే వెనిగర్ వేయవచ్చు. ఒకవేళ ఇది రిస్క్ అనుకుంటే మాత్రం బకెట్ లో వేసి ఉతికితే సరిపోతుంది. ఎలాంటి హానికరమైన రసాయనాలు లేకుండా వెనిగర్ తోనే పని పూర్తైపోతుంది. ఉతికిన తరవాత సరైన విధంగా ఆరవేయాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఆరిన తరవాత ఇస్త్రీ చేస్తే చాలు.


బేకింగ్ సోడాతో


​బేకింగ్ సోడా కూడా మరకలు వదిలించడంలో చాలా బాగా పని చేస్తుంది. వెనిగర్ చిట్కాతో పాటు ఇది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. పైగా దుస్తులకు కాస్తంత కొత్తదనం కూడా వస్తుంది. ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ బేకింగ్ పౌడర్ చల్లాలి. ఆ తరవాత దుస్తులను అలాగే పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల మరకలు త్వరగా తొలగిపోతాయి. పైగా దుర్వాసన కూడా తగ్గుతుంది. గట్టిగా పట్టి ఉన్న బురదను వదులుగా మార్చుతుంది. ఫలితంగా అదంతా పొడిలా రాలిపోతుంది. మరో రకంగా కూడా ఈ చిట్కా పాటించవచ్చు. బేకింగ్ సోడాని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఎక్కడైతే ఎక్కువగా మరకలు ఉన్నాయో అక్కడ ఈ పేస్ట్ ని అప్లై చేయాలి. కాస్తంత సాఫ్ట్ గా రబ్ చేయాలి. ఆ తరవాత మామూలు డిటర్జెంట్ తో ఉతకాలి. అలా చాలా సులువుగా మరకలు వదిలిపోతాయి.


మరి కొన్ని టిప్స్


మరకలు పోగొట్టడానికి మరో రకంగా కూడా ప్రయత్నించవచ్చు. ముందుగా దుస్తులను వేడి నీళ్లలో నానబెట్టాలి. అందులో సబ్బు వేయాలి. లేదా డిటర్జెంట్ వేసినా సరిపోతుంది. ఇలా కాసేపు అలాగే నానబెట్టాలి. వేడి నీళ్లలో నానబెట్టడం వల్ల మరకలు త్వరగా వదిలిపోయేందుకు అవకాశం ఉంటుంది. కనీసం గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తరవాత దుస్తులు బయటకు తీసి ఏదైనా ఓ పాత టూత్ బ్రష్ తీసుకోవాలి. కచ్చితంగా అది సాఫ్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఈ బ్రష్ తోనే మరకలపై సాఫ్ట్ గా రబ్ చేయాలి. అయితే..మీరు వాడే డిటర్జెంట్ మాత్రం క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలి. అలా అయితేనే త్వరగా మరకలు తొలగిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. ఇలా రబ్ చేసిన తరవాత ఓ సారి వాషింగ్ మెషీన్ లో వేసి ఉతికితే చాలు.


ఇంకేం చేయాలంటే 


ఇలా మరకలు పడ్డప్పుడు వాటిని ఎంత సేపు అలా ఉంచితే అంత మంచిది. పచ్చిగా ఉన్నప్పుడే నీళ్లు పోసి ఉతికితే ఆ మురికి అంతా మిగతా క్లాథ్ లోకి కూడా వెళ్లిపోతుంది. దీని వల్ల ఉతికి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. మరక పూర్తిగా ఎండిపోయిన తరవాత బ్రష్ తో దానిపై స్క్రబ్ చేయాలి. దీని వల్ల మట్టి అంతా తొలగిపోతుంది. ఉతికినప్పుడు చాలా సులువుగా ఆ మరక కనిపించకుండా పోతుంది. డిటర్జెంట్ వాడే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రెగ్యులర్ గా వాడేది మాత్రమే వినియోగించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa