భారత్-మాల్దీవుల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది. మాలేలో శుక్రవారం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో భేటీ అయిన ప్రధాని మోదీ, మిత్రదేశంగా మాల్దీవ్స్‌కు ₹4,850 కోట్ల రుణం అందిస్తున్నట్టు ప్రకటించారు. మాల్దీవుల వార్షిక రుణ చెల్లింపుల మొత్తాన్ని 40 శాతం మేర కుదించారు. ఈ ప్రకటన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న మాల్దీవులకు ఊరట కల్పించనుంది. వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాలపై విస్తృత చర్చ జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa