ఎట్టకేలకు ఆసియాకప్ 2025 షెడ్యూల్‌పై సందిగ్ధత వీడింది. ఆరోజు ప్రారంభమట.. ఫలానా రోజే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆసియా కప్ 2025కి సంబంధించి పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. నిజానికి ఈ టోర్నీ భారత్ వేదికగా జరగాల్సింది. కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహించాలని.. ఆతిథ్యహక్కులు ఉన్న బీసీసీఐ డిసైడ్ అయింది. దీనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని సభ్య దేశాలు కూడా అంగీకరించాయి.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ 2025 జరగనుంది. జులై 24న బంగ్లాదేశ్‌లో ఢాకాలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, తాజాగా వెల్లడించారు. ఈ టోర్నీలో భారత్ సహా మొత్తం ఎనిమిది దేశాలు పాల్గొననున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఫైనల్‌తో కలిపి మొత్తం 19 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అయితే వేదికలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది!
ఏ గ్రూప్‌లో ఎవరు?
8 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు.
గ్రూప్ ఏ: భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్
గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హంకాంగ్
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?
షెడ్యూల్ ప్రకారం, గ్రూప్ స్టేజ్‌లో సెప్టెంబరు 14న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో మొత్తంగా దాయాదులు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ప్రతీగ్రూప్ నుంచి రెండేసి టీమ్‌లో సూపర్-4కు చేరుకుంటాయి. అక్కడే ప్రతీ జట్టు మిగతా మూడు టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ లెక్కన గ్రూప్ ఏ నుంచి భారత్, పాక్.. సూపర్-4కి చేరితే.. అక్కడ మరోసారి తలపడతాయి. సూపర్-4లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఈ రెండు జట్లే ఫైనల్ చేరితే సెప్టెంబర్ 28న మరోసారి ఇండో, పాక్ మ్యాచ్ జరుగుతుంది. అంటే మొత్తంగా మూడు సార్లు దాయాదుల పోరు ఉంటుందన్నమాట!
ఆసియా కప్‌లో టీమిండియా షెడ్యూల్..
10 సెప్టెంబర్: భారత్ - యూఏఈ
14 సెప్టెంబర్: భారత్ - పాకిస్థాన్
19 సెప్టెంబర్: భారత్ - ఒమన్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa