ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాటికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 06:13 PM

తాడిమర్రి మండల పరిధిలోని దాడితోట, చిల్లవారి పల్లి గ్రామాల మధ్య వెలసిన కాటికోటేశ్వర క్షేత్రంలో కాటికోటేశ్వర స్వామికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి మూలవిరాట్ ను పూలమాలలు, వెండి ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారికి కాయ కర్పూరాలు అందించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa