సాధారణంగా మన దగ్గర ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులంటే సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే వైద్యలుండరు.. మందులుండవు.. పట్టించుకునే నాథుడే ఉండడు. అదే మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుదామంటే టీచర్లు సమయానికి రారు.. వచ్చినా శ్రద్ధగా పాఠాలు చెప్పరు.. అసలు చాలా మంది టీచర్లకే చదువు రాదనే అభిప్రాయం నాటుకుపోయి ఉంది. అయితే తాజాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి చూసి.. తల్లిదండ్రులు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్‌లో జాయిన్ చేసేందుకు ముందుకు వస్తుండగా.. అలాంటి వారి నమ్మకాన్ని.. ఇదుగో ఇలాంటి ప్రభుత్వ టీచర్లు ముక్కలు చేస్తున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నెలకు 70 వేల రూపాయల జీతం తీసుకుంటున్న ఓ వ్యక్తికి పదకొండు ఇంగ్లీష్ స్పెల్లింగ్.. అదేనండి ఎలవెవన్ స్పెల్లింగ్ రాక తత్తరబిత్తర పడ్డారు. ఇది చూసిన ఉన్నతాధికారులు ఆశ్చర్యపోగా.. సదరు టీచరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నారు. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ వెలుగు చూసిందంటే..
ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ స్కూల్లో వెలుగు చూసింది. స్కూల్లో చెకింగ్ నిర్వహించడం కోసం వచ్చిన ఉన్నతాధికారులు సదరు టీచర్‌ను కొన్ని నంబర్ల ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ బోర్డు మీద రాయమని కోరారు. ఎలెవన్, నైంటీన్ (11, 19) ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రాయమని కోరగా.. సదరు టీచర్..ఎవెన్, నినితిన్('aivene','ninithin) అని తప్పుగా రాశారు. అయితే క్లాస్ రూమ్‌లో జరిగిన ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడిది వైరల్ అవ్వడంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుల సామర్థ్యం మీద పలు అనుమానాలను తెర మీదకు తెస్తోంది.
సదరు ఉపాధ్యాయుడు రాసిన స్పెల్లింగ్స్ చూసి ఉన్నతాధికారులు షాకయ్యారు. అతడు రాసిన స్పెల్లింగ్ కరెక్టేనా అని టీచర్‌ను ప్రశ్నించగా.. అతడు ఎంతో నమ్మకంగా అవునని బదులిచ్చాడు. పైగా పదంలోని సగం అక్షరాలను క్యాపిటల్, సగం స్మాల్ లెటర్స్‌లో రాశారు. అతడు రాసిన స్పెల్లింగ్‌ను అతడే చదివి.. కరెక్ట్ అని తీర్మానించారు. దీంతో ఉన్నతాధికారులు ఇదే స్పెల్లింగ్‌ను విద్యార్థులకు చెప్పమనగా.. తప్పుగా రాసిన స్పెల్లింగ్‌నే అతడు వారికి బోధించారు. ఇది చూసి అధికారులు తలలు పట్టుకున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. సదరు టీచర్‌కు బోధనలో 5 సంవత్సరాల అనుభవం ఉండటం మరింత కలవరపరస్తుంది.
ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. నెలకు 70 వేల రూపాయల జీతం తీసుకునే ఉపాధ్యాయుడు ఇతడు.. ఇతడికి కనీసం నంబర్ల స్పెల్లింగే రావడం లేదు. ఎలెవన్ స్పెల్లింగ్ అతడికో మిస్టరీగా మారింది. మరి ఇలాంటి టీచర్ల చేతిలో పిల్లల భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది.. వేలకు వేల జీతం ఇచ్చే ప్రభుత్వాలు.. ఇలంటి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపిక చేసి.. సమాజాన్ని ఏం చేద్దమనుకుంటున్నారు.. మన సదువులు ఎంత గొప్పగా ఉన్నాయో ఈ టీచర్‌ను చూస్తేనే అర్థం అవుతుంది.. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోదా.. దీని గురించి పట్టించుకోరా అని ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. మరి ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa