డబ్బు కోసం గాళ్‌ఫ్రెండే తన బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేయించిన సంచలన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఈ డ్రామాలో దుబాయ్‌లో ట్రావెల్ సంస్థలో మేనేజర్‌గా పనిచేసే లారెన్స్ మెల్విన్ బాధితుడిగా మారాడు. లారెన్స్ మెల్విన్ ఇటీవల తన స్వస్థలమైన బెంగళూరుకు వచ్చాడు. ఈ నెల 16 నుంచి అతను కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన అతడి తల్లి అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లారెన్స్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు రూ.2.5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది.పోలీసుల దర్యాప్తులో ఈ కిడ్నాప్ వెనుక లారెన్స్ గాళ్‌ఫ్రెండ్ మహిమా కుట్ర ఉందని తేలింది. ఈ నెల 14న మహిమ "బయటకు వెళ్దాం" అని చెప్పడంతో లారెన్స్ ఆమెతో కలిసి కారు బుక్ చేసుకుని బయలుదేరాడు. కొంతదూరం వెళ్లాక డ్రైవర్ కారును దారి మళ్లించాడు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కారెక్కి లారెన్స్‌పై దాడి చేసి, అతడి వద్దనున్న రూ. 1 లక్ష నగదును లాక్కున్నారు. లారెన్స్‌ను ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించి, దాదాపు ఎనిమిది రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో, లారెన్స్ కుటుంబానికి ఫోన్ చేసి రూ.2.5 కోట్లు డిమాండ్ చేశారు.అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఒక మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. లారెన్స్‌ను సురక్షితంగా కాపాడారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రధాన కుట్రదారుగా గుర్తించిన మహిమతో పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa