నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్లమెంటు ఆవరణలో సందడి చేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను ప్రతి రోజు పార్లమెంటుకు సైకిల్‌పై వస్తానని.. దాన్ని బాలకృష్ణకు చూపించారు. బాలయ్య ఆ సైకిల్‌పై ఎక్కి కాసేపు సందడి చేశారు. అనంతరం ఆయన పార్టీ ఎంపీలతో కలిసి స్పీకర్ ఓంబిర్లాతో సమావేశమయ్యారు. తర్వాత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతులు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa