ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 18 నుంచి పది రోజుల వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆగస్టులో అమలు చేయనున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కొన్ని బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం తెలపనున్నారని సమాచారం. అలాగే, అమరావతి రాజధాని పై ప్రత్యేక చర్చ ఉండనున్నట్లు టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa