ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాధానాలు చెప్పడం ఇష్టం లేక,,,,దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అర్ధనగ్న ప్రదర్శన

international |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:38 PM

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి జైలు పాలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనపై పలు కేసులు నమోదు కాగా.. అధికారులు దర్యాప్త చేపట్టారు. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు ఆయన నిరాకరిస్తూనే వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన జైల్లో ఉండగా.. అధికారులు విచారించేందుకు వెళ్లగా మరోసారి నిరాకరించడం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అధికారులు ఆయన వద్దకు వెళ్లగా.. తన బట్టలు విప్పేసి మరీ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. సెల్‌ లోపల ఉండే బట్టలు తీసేసి మరీ నేలపై పడుకున్నారు.


యూన్ సుక్ యోల్ మాజీ ప్రధాన మంత్రిగా, మాజీ అధ్యక్షుడిగా పనిచేసినప్పటికీ.. ఇటీవల దేశాన్ని అల్లకల్లోలం చేసిన మార్షల్ లా విఫల యత్నం తర్వాత ఆయనను అభిశంసనకు గురయ్యారు. ఫలితంగా ఆయన అధికారం కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై దేశ ద్రోహం, తిరుగుబాటు వంటి కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఆయనపై, ఆయన సతీమణిపై ఉన్న ఇతర ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే వీటన్నిటిపై విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు కోరారు. ఇదే విచారణకు ఆయన సహకరించడానికి నిరాకరించారు.


 విచారణకు యూన్ నిరాకరించడానికి ఆయన తరపు న్యాయవాదులు ఆరోగ్య సమస్యలను కారణంగా చూపించారు. అనేక మార్లు ఇలాగే చేయగా.. అధికారులే నేరుగా రంగంలోకి దిగారు. సూటిగా జైలుకు వెళ్లి ఆయన్ను విచారించబోయారు. కానీ సమాధానాలు చెప్పడం ఏమాత్రం ఇష్టం లేని ఆయన.. తన బట్టలు విప్పేసి మరీ నిరసన చేపట్టారు. ఇలా అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేయడం.. దేశ ప్రజలను, ముఖ్యంగా రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన ఈ చర్య విచారణ ప్రక్రియకు ఆటంకం కలిగించడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను అగౌరవపరిచినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఈ ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఒక దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని విమర్శిస్తున్నారు.


యూన్ సుక్ యోల్ మార్షల్ లా యత్నం తర్వాత దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆయన అభిశంసన, అరెస్టుల పర్యవసానంగా దేశ భవిష్యత్తుపై అపనమ్మకం పెరిగింది. ప్రస్తుతం జైలులో ఉన్న యూన్ సుక్ యోల్ విచారణకు సహకరించకపోతే.. న్యాయ వ్యవస్థకు కూడా సవాల్ విసిరినట్లు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక మాజీ అధ్యక్షుడు చట్టాన్ని ధిక్కరించడం, దేశంలో చట్టం యొక్క పాలనపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa