దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతుకు కేంద్రం ఏటా ఆరువేల రూపాయల నగదు ఇస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది తొలి విడత నిధులు ఇవాళ(2 ఆగస్టు 2025)న విడుదల చేయనుంది. వారణాసిలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులు విడుదల చేస్తారు. ఇప్పటికే 19 విడతలుగా రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తూ వచ్చారు. ఇవాళ 20వ విడత నిధులు జమ చేస్తారు.అర్హత కలిగిన రైతులు వాయిదాను పొందాలంటే e-KYC మాత్రమే కాదు.. ఇతర అవసరమైన పనులను కూడా పూర్తి చేసి ఉండాలి. ఆధార్ ఆధారిత పేమెంట్, e-KYCతో పాటు భూమి విత్తనాలను తప్పనిసరి.ఈ తప్పనిసరి ప్రమాణాలను పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు పొందలేరు. ఈ పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు eKYC తప్పనిసరి. మీరు e-KYC ప్రక్రియను 3 మార్గాల్లో పూర్తి చేయవచ్చు. ఓటీపీ ఆధారిత ఇ-కేవైసీ, బయోమెట్రిక్ ఇ-కేవైసీ, ఫేస్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయొచ్చు.రైతులకు ప్రోత్సాహంగా ఏటా ఆరు వేల రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్’ యోజనను అమలు చేస్తోంది. ఒక్కో రైతుకు రూ. 2,000 చొప్పున మూడుసార్లు—మొత్తం రూ. 6,000 సంవత్సరానికి అందిస్తున్నారు. ఇప్పటివరకు 19 విడతలుగా ఈ నిధులు పంపిణీ చేశారు.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 19వ విడత నిధులు విడుదల చేసిన కేంద్రం, 20వ విడతను జూన్‌లో ఇవ్వాల్సి ఉన్నా, కొన్ని పరిపాలనా కారణాల వల్ల అది వాయిదా పడింది. చివరకు కేంద్రం ఇటీవల ప్రకటన చేస్తూ, ఆగస్టు 2న నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది.ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని ఓ కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈసారి రూ. 20,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
*మీ ఖాతాలో డబ్బు వచ్చిందా? ఇలా చెక్ చేయండి:
ఆన్‌లైన్ పద్ధతి: PM-Kisan అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి: https://pmkisan.gov.in Home Page లో "Know Your Status" లేదా "Beneficiary Status" లింక్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్ / అకౌంట్ నంబర్ / రిజిస్ట్రేషన్ నంబర్ లో ఏదో ఒకటి ఎంటర్ చేయండి
గెట్ డేటా (Get Data) బటన్‌ను క్లిక్ చేయండి
*మీకు లేటెస్ట్ వాయిదా ₹2,000 జమ అయిన స్టేటస్ కనిపిస్తుంది
SMS / Mobile App ద్వారా: మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు SMS ద్వారా నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది.లేకపోతే PM-Kisan Mobile App డౌన్లోడ్ చేసి, అక్కడ నుంచి కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
*మీకు డబ్బు రాలేదా?
బ్యాంకు అకౌంట్, ఆధార్ లింకింగ్, eKYC పూర్తి అయ్యాయో లేదో చెక్ చేయండి
https://pmkisan.gov.in వెబ్‌సైట్‌లో eKYC స్టేటస్, నామినీ వివరాలు సరిచూడండి
స్థానిక ఆర్ఎంసీ / వ్యవసాయ విభాగం కార్యాలయంను సంప్రదించండి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa