ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్ల కింద ముడతలు వాపులను పోగొట్టే చిట్కా

Life style |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 11:08 PM

గంటల కొద్దీ సిస్టమ్ ముందు కూర్చుని పని చేయడం వల్ల మొట్టమొదటగా ఎఫెక్ట్ పడేది కళ్లపైనే. కంటిన్యుయస్ గా స్క్రీన్ వైపు చూడాల్సి వస్తుంది. పని చేసినప్పుడు ఇది తప్పదు. అయితే..మధ్యలో కాస్త కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్క్ చేయడం వల్ల కళ్లపౌ ఒత్తిడి పడుతోంది. ఈ అలవాటుకు తోడు చాలా మంది రాత్రి సరిగ్గా నిద్రపోవడం లేదు. నిద్రలేమి కారణంగా రకరకాల అనారోగ్యాలు వెంటాడతాయి. అయితే..ముందుగా ముఖంపైనే మార్పులు వస్తాయి.


కళ్ల కింద నల్లటి వలయాలతో పాటు ముడతలు కూడా వస్తాయి. అంతే కాదు. చర్మం అంతా వేలాడినట్టుగా అవుతుంది. తక్కువ వయసులోనే ముసలి వారిలా కనబడతారు. ఈ ముడతలు కనబడకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే..యోగా ఎక్స్ పర్ట్ హన్సా జీ చెప్పిన చిట్కాలు ప్రయత్నిస్తే చాలా సులువుగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.


స్క్రీన్ టైమ్ 


ఇప్పుడున్న లైఫ్ స్టైల్ స్క్రీన్ టైమింగ్ లేకుండా గడపడం చాలా కష్టం. ఉదయం నుంచి రాత్రి వరకూ ఏదో విధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై పని చేయాల్సిందే. ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ లేకుండా అసలు పనులే అవ్వడం లేదు. అంతా డిజిటల్ మయం అయింది. టెక్నాలజీ పరంగా చూస్తే ఇదంతా బానే ఉంది. కానీ..ఆరోగ్యపరంగా మాత్రం వీటి వల్ల సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ గంటల పాటు స్క్రీన్స్ ముందు గడపాల్సి వస్తోంది. ఈ కారణంగా కళ్లపై స్ట్రెయిన్ పెరుగుతోంది. ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తరవాత నిద్రపోవడమూ ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ఈ కారణంగానే కళ్ల కింద నల్లటి వలయాలు వస్తున్నాయి. అంతే కాదు. ముడతలు పడి చర్మం అంతా వేలాడినట్టుగా అవుతోంది. కొన్ని సార్లు కళ్ల కింద చర్మం వాపులు వస్తున్నాయి. ఇది మరీ హానికరం కాకపోయినా అసౌకర్యం కలిగిస్తాయి.


ఎందుకు వస్తాయి


కళ్ల కింద చర్మం వాపులు రావడాన్ని Puffy Eyes గా పిలుస్తారు. శరీరంలో ఉన్న నీరు కళ్ల చుట్టూ చేరుకున్నప్పుడు ఇలా జరుగుతుంది. ఇందుకు చాలా కారణాలున్నాయి. సరిగ్గా నిద్రపోకపోయినా, ఉప్పు విపరీతంగా తినడం లాంటివి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రీజన్స్. అయితే..వీటతో పాటు హార్మోనల్ మార్పులు, అలెర్జీలు, స్క్రీన్ టైమ్ ఎక్కువ కావడం లాంటివి కూడా ఇందుకు కారణమవుతాయి. అయితే..ఈ సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదని చెబుతన్నారు హన్సాజీ. కొన్ని చిట్కాలతో ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు అని వివరించారు. అందులో మొదటిది ఏంటంటే..ఇంట్లోనే యాంటీ పఫ్ సీరమ్ తయారు చేసుకోవడం. అలోవెరా జెల్ తో దీన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.


యాంటీ పఫ్ సీరమ్ తయారీ


ఈ సీరమ్ తయారు చేయాలంటే ముందుగా ఓ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి. దీంతో పాటు రెండు చుక్కల విటమిన్ ఇ ఆయిల్ అవసరం అవుతుంది. ఓ చుక్క లావెండర్ లేదా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ సరిపోతుంది. ఈ మూడింటినీ ఓ కప్పులో పోసి బాగా మిక్స్ చేయాలి. గడ్డలు కట్టకుండా జెల్ లా మారేంత వరకూ సరైన విధంగా కలపాలి. ఆ తరవా ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేయాలి. సాఫ్ట్ గా వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. రోజూ నిద్రపోయే ముందు ఈ జెల్ రాసుకుంటే మంచిది. విటమిన్ ఇ చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఇందులో కలిపిన ఎసెన్షియల్ ఆయిల్ ఇన్ ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. దీంతో పాటు మరో చిట్కా కూడా పాటించవచ్చు. ఇది కూడా సులువుగానే ఫాలో అయిపోవచ్చు. అది కూడా తెలుసుకుందాం.


క్యామొమైల్ టీ 


క్యామొమైల్ టీ ద్వారా కూడా పఫ్పీ ఐస్ సమస్యను తగ్గించుకోవచ్చని చెప్పారు హన్సా జీ. అదెలాగో చూద్దాం. క్యామొమైల్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల స్కిన్ ఇరిటేషన్ తగ్గడంతో పాటు వాపులు తగ్గిపోతాయి. అయితే..రెండు క్యామొమైల్ టీ బ్యాగ్స్ ని ఓ కప్పు వేడి నీళ్లలో ఉంచాలి. కనీసం రెండు నిముషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరవాత వాటిని బయటకు తీసి చల్లారనివ్వాలి. వీటిని డీప్ ఫ్రీజ్ లో కనీసం పావుగంట పాటు ఉంచాలి. ఇవి చల్లగా మారిన తరవాత వాటిని కళ్లపై పెట్టుకోవాలి. కనీసం పదిహేను నిముషాల పాటు అలా కళ్లపై ఉంచుకోవాలి. వారానికి కనీసం రెండు మూడుసార్లు ఇలా చేస్తే ఫలితాలు బాగుంటాయి.


మరో చిట్కా


కల్లుప్పుతోనూ ఈ కళ్లకింద వాపులు తగ్గించుకోవచ్చు. సాల్ట్ లో ఆస్మాటిక్ గుణాలుంటాయి. కళ్ల కింద పేరుకుపోయిన నీటిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ముందుగా ఓ కప్పు వేడి నీళ్లలో ఓ టేబుల్ స్పూన్ కల్లుప్పు కలపాలి. అందులో కాటన్ బాల్స్ ని నానబెట్టాలి. కాసేపైన తరవాత ఆ కాటన్ బాల్స్ తో కళ్ల చుట్టూ మసాజ్ చేసుకోవాలి. కనీసం పది నిముషాల పాటు వాటితో స్క్రబ్ చేసుకుంటే మంచిది. అయితే.. ఉప్పు నీళ్లు కళ్లలోకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాదు. ఈ చిట్కాని ఎప్పుడో ఓసారి పాటిస్తే బెటర్. రెగ్యులర్ గా అయితే ఇందాక చెప్పిన చిట్కాలు ప్రయత్నించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa