రసవత్తరంగా సాగిన ఇంగ్లండ్-భారత్ ఆఖరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. సిరాజ్ 5, ప్రసిద్ధ్ 4, ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు. ఓ దశలో మ్యాచ్‌ను దాదాపుగా చేజార్చుకున్నట్లే అనిపించినా.. ఆఖర్లో పుంజుకున్న టీమిండియా బౌలర్లు చకాచకా వికెట్లు పడగొట్టి జట్టుకు గెలుపును అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa