ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకొని రూపొందించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి రుసుములు లేకుండా బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం పొందనున్నారు.మంత్రి వివరించటంతో, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ వర్గాలకు చెందిన మొత్తం 6,700 బస్సుల్లో ఈ పథకం అమలవుతుంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 11,500 బస్సుల్లో 8,459 బస్సులు ఉచిత ప్రయాణ సేవల్లో భాగంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు.మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించాలంటే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడీ చూపించి ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో వారికి జీరో ఫేర్ టికెట్ (ఉచిత టికెట్) జారీ చేయబడుతుందని మంత్రి తెలిపారు.ఈ పథకాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ₹1,950 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. అదేవిధంగా, రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు ఇప్పటికే 700 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశామని, మరిన్ని 1,400 ఎలక్ట్రిక్ బస్సులను వచ్చే రెండేళ్లలో ప్రవేశపెట్టే ప్రణాళికలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa