ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంకుడుకాయలు ఉంటే చాలు ,,,, ఎన్ని రకాలుగా వాడొచ్చొంటే

Life style |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 09:34 PM

కుంకుడుకాయలు.. వీటిని చాలా మంది మర్చిపోయారు. కానీ, ఒకప్పుడు సబ్బుల బదులు ఇవే వాడేవారు. ఇప్పుటికీ చాలా మంది కుంకుడుకాయల నీటితోనే తలస్నానం చేస్తుంటారు. కేవలం, తలస్నానానికి మాత్రమే కాదు. వీటిని అనేక రకాలుగా వాడొచ్చు.


కుంకుడుకాయలు ఉంటే చాలు ఇంట్లో ఏ క్లీనర్ లేకపోయినా అన్నీ పనులు చేయొచ్చు, ఎన్ని రకాలుగా వాడొచ్చొంటే


లైఫ్‌స్టైల్ చేంజ్ అవ్వడంతో చాలా మంది ఈజీగా దొరికే ప్రోడక్ట్స్, ఐటెమ్స్‌తో డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ, ఒకప్పుడు ప్రతీది ఇంట్లోనే తయారుచేసి వాడేవారు. అది స్నానానికి సబ్బు అయినా, తల క్లీన్ చేసే షాంపైనా, గిన్నెల్ని తోమే లిక్విడ్ అయినా. ఏదైనా కూడా చాలా వరకూ ఇంట్లోనే వాడేవారు. ఆ కాలంలో కుంకుడుకాయ ఈ పనులన్నీ చేసేది. రాన్రాను దీన్ని వాడడం కష్టంగా అనిపించి ప్రతీదానికి మరో ఆల్టర్నేటివ్ చూసుకున్నారు. దీంతో కెమికల్స్‌తో తయారైన ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడడం మొదలుపెట్టారు. కానీ, వీటి వాడకం వల్ల పర్యావరణానికి ప్రమాదమే. మనకి ప్రమాదమే. అలా కాకుండా క్లీనింగ్ చేయడానికి కుంకుడుకాయల్ని మళ్లీ వాడితే బాగుంటుంది. అసలు దీనిని ఎన్నిరకాలుగా వాడొచ్చో చాలా మందికి తెలియదు. ఇవొక్కటి ఉంటే చాలు ఇంట్లోకి మరో క్లీనింగ్ లిక్విడ్ కొనాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. నేచురల్‌గా దొరికే ఈ పదార్తం సాధారణ డిటర్జెంట్‌లానే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.పైగా పర్యావరణానికి మనకి ఎలాంటి నష్టం ఉండదు. మరి వీటిని ఎలా వాడొచ్చో తెలుసుకోండి.


బట్టలు ఉతికేందుకు


ఇవి సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఇంట్లోనే తయారుచేసిన డిటర్జెంట్‌లా వాడొచ్చు. వీటితో పట్టు, కాశ్మీర్, ఉన్ని వంటి బట్టల్ని ఉతికితే వాటి రంగు పోవు. పైగా ఫ్యాబ్రిక్ మృదువుగా మారి ఎక్కువరోజులు మన్నుతాయి. డైపర్స్, నాప్‌కిన్స్ వంటివన్నీ కూడా ఈ కుంకుడుకాయలు నానబెట్టిన నీటిలో నానబెట్టి ఉతకొచ్చు. ఇలా వాడడం వల్ల కెమికల్ ప్రోడక్ట్స్ అవసరమే రాదు. పైగా తక్కువ నీరు అవసరమవుతుంది. ఎక్కువ శక్తి కూడా అవసరం ఉండదు.


ఆల్ పర్పస్ క్లీనర్


ఈ ఒక్క కుంకుడుకాయలు నానబెట్టిన నీటిని ఇంటిని చక్కగా క్లీన్ చేయడానికి వాడొచ్చు. ఈ ద్రవాన్ని ఇంటి బాత్రూమ్ దగ్గర్నుంచి కిటికీ అద్దాలు, సింక్, టాయిలెట్స్, బాత్ టబ్, పింగాణి, టైల్స్ వంటివి కూడా క్లీన్ చేయడానికి వాడొచ్చు. అంతేకాదు, కారు, టైర్స్, స్టీరింగ్ వీల్, కిటికీల వంటివి కూడా క్లీన్ చేయొచ్చు. జ్యువెలరీని కూడా చేయడానికి చాలా మంది ఈ కుంకుడుకాయల్ని వాడతారు.


జుట్టుకి


జుట్టుని బలంగా, ఆరోగ్యంగా, మృదువుగా, మెరిసేలా చేయడంలో కుంకుడుకాయలు బెస్ట్. ఈ గింజల్లో ఎ, డి, ఇ, కె వంటి మంచి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టుని ఆరోగ్యంగా చేస్తాయి. జుట్టుని మాయిశ్చరైజ్ చేసి సహజ కండిషనింగ్‌లా పనిచేస్తాయి. చుండ్రు, తామర, సోరియాసిస్ వంటి సమస్యలతో పోరాడతాయి. దీనిని వాడడం పేలుకూడా తగ్గుతాయి. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.


స్కిన్‌కి కూడా


ఇప్పటివరకూ చాలా మంది కుంకుడుకాయల్ని జుట్టుకి మాత్రమే వాడొచ్చొని అనుకుంటారు. కానీ, ఇది స్కిన్‌పై కూడా చాలా మైల్డ్‌గా ఉంటుంది. స్నానం చేయడానికి ఇది ప్రత్యేకంగా వాడొచ్చు. వాసన కూడా ఉండదు. ఎక్కువగా ఫ్రాగ్రెన్సెస్ లేని ప్రోడక్ట్స్ వాడాలనుకునేవారికి ఇదో గొప్ప ఆప్షన్. దీని వల్ల స్కిన్ క్లీన్ అవుతుంది. టాన్ తగ్గుతుంది. పైగా తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకి ఈ కుంకుడుకాయ నీరు ది బెస్ట్ అని చెప్పొచ్చు.


ఫుడ్ ఐటెమ్స్‌ని క్లీన్ చేయడం


మనం బయట కొనే పండ్లు, కూరగాయలు అన్నీ కూడా చాలా వరకూ కెమికల్స్ వేసి పండించడం, వాటిని మగ్గించేందుకు కెమికల్స్ వేయడం, రవణా టైమ్‌లో రకరకాల క్రిమీకీటకాలు చేరడం జరుగుతుంది. అలాంటప్పుడు వీటిని క్లీన్ చేసేందుకు కుంకుడుకాయల నీరు ది బెస్ట్. కుంకుడు కాయల నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు వాటిని నానబెట్టి తర్వాత వాటిని నార్మల్ నీటితో క్లీన్ చేయండి. దీని వల్ల హానికరమైన కెమికల్స్, అవశేషాలు తగ్గిపోతాయి. వాటిని ఏంచక్కా తినొచ్చు.


గిన్నెలు కడగడం


కుంకుడు కాయల నీటిని వాడి మనం గిన్నెలు కూడా క్లీన్ చేయొచ్చు. జిడ్డు మరకలు చక్కగా పోతాయి. ఈ లిక్విడ్‌తో గిన్నెలు, గ్లాసులు, కత్తిపీటలు, పాన్స్ ఇలా ఏవైనా కడగొచ్చు. కొబ్బరిపీచుని ఉపయోగించి కొద్దిగా కుంకుడు కాయ నానబెట్టిన నీటిని పోసి రుద్దితే ఎలాంటి మరకలైనా ఈజీగా పోతాయి. ఇప్పటికీ చాలా మంది పూజా సామాన్లని కడిగేందుకు కుంకుడుకాయ నీటిని వాడతారు. ఈ విషయం ఎంత మందికి తెలుసు. జిడ్డు మరకల్ని పోగొట్టడంలో దీనికిదే సాటి.


గార్డెన్‌లో


ఈ నీటిని మనం ఇంట్లోని చెట్లకి స్ప్రే చేస్తే తెగుళ్ళు, ఈగలు, పేలు, ఇతర కీటకాలు తగ్గుతాయి. అంతేకాదు, చికాకు కలిగించే తెగుళ్లని దూరం చేస్తాయి. కీటకాలు, తెగుళ్ల వికర్షకంగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ నీటితో పెంపుడు జంతువులని కూడా క్లీన్ చేయొచ్చు. దీని వల్ల జంతువులపై ఉన్న క్రిమీకీటకాలు కూడా దూరమవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa