చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో చికున్‌గున్యా కేసులు పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం కొవిడ్ తరహాలో ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఫాగింగ్, డ్రోన్లతో పర్యవేక్షణతో పాటు, ప్రత్యేక చర్యగా ‘ఎలిఫెంట్ మస్కిటోలు’ను వదిలింది. ఈ ఏనుగు దోమలకు మరో పేరు టెక్సోరెంకైటిస్. ఇవి ఇతర దోమల గుడ్లను తింటాయి. ఒక్క లార్వా 100 గుడ్ల వరకు తినగలదు. దీంతో వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa