AP: చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత కార్యక్రమంలో మాట్లాడుతూ.. చేనేత కుటుంబాల కోసం నేతన్న భరోసా పథకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో చేనేతలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. అలాగే ఆగస్టు నుంచే ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa