సైన్యంలో పురుషులకు పోస్టులను రిజర్వ్ చేయలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏకపక్ష 'పురుష-స్త్రీ' కోటాను సుప్రీం తప్పుపట్టింది. సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల పరీక్షల్లో ఇద్దరు మహిళా అధికారులు వరుసగా 4, 5వ ర్యాంకులు సాధించారు. అయినా వారిని విధుల్లోకి తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పోస్టుల్లో మహిళా అధికారులు తక్కువగా ఉండటంపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. తాజాగా సోమవారం తీర్పును వెలువరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa