విద్యా హక్కు చట్టం ప్రకారం, 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో 25% సీట్లు పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 12 నుండి 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నివాసానికి 5 కి.మీ. దూరంలోని పాఠశాలల్లోనే ప్రవేశాలు ఉంటాయి. తోబుట్టువులు అదే పాఠశాలలో చదువుతుంటే ప్రాధాన్యత ఇస్తారు. దరఖాస్తు చేసుకున్న వారికి 31న సీట్లు కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు cse.ap.gov.in చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa