పులివెందుల ZPTC ఉప ఎన్నిక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు ప్రలోభాలు, దౌర్జన్యాలు చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఈ మేరకు ఓటుకు రూ.10 వేలు ఇస్తామని ఓటర్లను ప్రలోభపెడుతున్నారని అన్నారు. ఆ పార్టీ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారని, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై EC చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa