ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాకాలంలో పదేపదే మూత్రానికి వెళ్తున్నారా

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 11:24 PM

వర్షాకాలంలో పదేపదే మూత్రానికి వెళ్తున్నారా, అయితే ఇప్పుడు చెప్పే కొన్ని ఫుడ్స్ తీసుకుంటే చాలు, ప్రాబ్లమ్ తగ్గుతుంది


​ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం అనేది ఎక్కువగా డ్రింక్స్ తీసుకోవడం, యూరిటిస్, మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. మన శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ మత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. నీరు, యూరిక్ యాసిడ్, యూరియా, ట్యాక్సిన్ కలిగిన మూత్రం మూత్రాశయంలోనే నిండి బయటికి మూత్ర రూపంలో వెళ్తాయి. ఓ వ్యక్తి దాదాపు 2 లీటర్ల నీరు తాగితే 24 గంటల్లో 7 సార్ల కంటే ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తే దానినే అతిమూత్ర సమస్యల అంటారు. దీనిని ముందుగానే గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.


అతి మూత్రసమస్యకి కారణాలు


తరచుగా మూత్ర విసర్జనకి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవి..


మూత్రనాళంలో ఇన్ఫెక్షన్


మూత్ర నాళంలో వాపు


ప్రెగ్నెన్సీ


పొత్తికడుపులో కణితి ఉండడం


మూత్రనాళంలో కణితీ


ఇంటర్‌స్టీషియల్ సిస్టిటిస్


మూత్రాశయ గోడ వాపు


మూత్రనాళంలో రాళ్ళు


కొన్ని మందులు


రేడియోథెరపీ


లైంగింకంగా వచ్చే సమస్యలు


న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్


మూత్రం బయటికి వెళ్లే మార్గాన్ని అడ్డుకునే క్యాన్సర్


మూత్ర విసర్జన లక్షణాలు


లక్షణాలు


అతిమూత్ర సమస్య వచ్చాక కనిపించే లక్షణాలు


కడుపునొప్పి


నోక్టురియా అంటే రాత్రుళ్ళు ఎక్కువసార్లు మూత్రం రావడం


మూత్ర విసర్జనలో ఇబ్బంది


మూత్రనాళం పూర్తిగా ఖాళీ కాకపోవడం


పొత్తికడుపులో నొప్పి


దాహంగా అనిపించడం


జ్వరం


వికారం, వాంతులు


యోని, పురుషాంగ ఉత్సర్గాలు


ఈ సమస్యని కంట్రోల్ చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటంటే


దానిమ్మ తొక్కల సారం


​దానిమ్మ తొక్కల్లో సూక్ష్మజీవులని నాశనం చేసే సామర్థ్యం ఉంది. ముక్యంగా, ఈకోలీ అనే బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది ప్రధాన మూత్ర నాళాల ఇన్ఫెక్షన్స్‌కి కారణమవుతుంది. దానిమ్మ తొక్కల సారాన్ని నోటిద్వారా తీసుకుంటే UTI సమస్యని తగ్గించి, రెగ్యులర్‌గా మూత్ర విసర్జనని కంట్రోల్ చేస్తుంది.


క్రాన్బెర్రీస్ జ్యూస్


​క్రాన్బెర్రీస్ కూడా మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్స్‌ని తగ్గిస్తుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్‌కి కారణమైన ఈకోలీ అనే బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా దీనిని తీసుకోవచ్చు. క్రాన్బెర్రీస్ మూత్రనాళాలలోని బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఆడవారిలో యూటిఐ కారణంగా తరచుగా వచ్చే మూత్ర సమస్యల్ని ఈ క్రాన్బెర్రీస్ జ్యూస్ తగ్గిస్తుంది. దీనిని బయట దొరికేవి తాగొచ్చు. లేదా మీరు తయారుచేసుకుని తాగొచ్చు. డ్రై కాన్బెర్రీస్‌ని నీటిలో కాసేపు నానబెట్టి ఆ తర్వాత బ్లెండ్ చేసి రసంలా చేసి తాగండి.


తులసి


తులసిలో కూడా బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనిని ఎన్నో ఇన్ఫెక్షన్స్‌కి మందుగా వాడతారు. దీనికోసం కొన్ని తులసి ఆకుల్ని మొత్తగా చేసి కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవచ్చు. తులసి ఆకుల్ని కొద్దిగా నీటిలో మరిగించి దాని సారాన్ని తయారుచేయొచ్చు. తర్వాత, ఈ సారాన్ని తాగడం ద్వరా తులసి ద్వారా వచ్చే ప్రయోజనాల్ని పొందొచ్చు.


ఉసిరి


ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అనియంత్రిత రక్తంలో చక్కెర స్థాయిల వల్ల రెగ్యులర్‌గా మూత్రవిసర్జన జరుగుతుంది. దీనికోసం మీరు ఉసిరితో రసం చేసి రెగ్యులర్‌గా తీసుకోండి. దీనిని జ్యూస్ చేసి అలానే తీసుకోవచ్చు లేదా కాస్తా నీరు కలిపి తీసుకోవచ్చు.


మెంతులు


ఓ అధ్యయనం ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి జీవన నాణ్యతని మెరుగ్గా చేయడానికి మెంతులు ఉపయోగపడతాయి. ఇందులోని బయోయాక్టివ్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి కారణంగానే డయాబెటిస్, తరచుగా మూత్రవిసర్జనకి కారణమవుతుంది. కాబట్టి, మీరు మెంతుల్ని ప్రతిరోజూ కొద్ది పరిమాణంలో తీసుకోవాలి. విత్తనాల పొడిలా చేసి తీసుకోవచ్చు.


ఉలవలు


ఉలవలు కూడా ఎన్నో సమస్యల్ని దూరం చేయడంలో ఉపయోగపడతాయి. ఇందులో వివిధ రకాల బయోయాక్టివ్ గుణాలు ఉంటాయి. ఇవి మూత్ర సమస్యల్ని తగ్గించడమే కాకుండా ఈకోలీ, ఇతర బ్యాక్టీరియాలకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. కొన్ని చెంచాల ఉలవల్ని తీసుి పాన్‌లో వేసి ఫ్రై చేయండి. వీటిని పొడి చేసి నీటితో కలిపి తాగండి. రెగ్యులర్‌గా తింటే సమస్య తగ్గుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa