అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని ఆస్టిన్ టార్గెట్ పార్కింగ్ స్థలంలో సోమవారం ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న 30 ఏళ్ల నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపి, పారిపోతూ రెండు వాహనాలు దొంగిలించాడు. పోలీసులు దక్షిణ ఆస్టిన్‌లో 32 కిమీ దూరంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa