ఏపీలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని పలువులు డిమాండ్ చేస్తున్నారు. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa