భారీ వర్షాలతో ఉత్తర భారతదేశ రాష్ట్రాలు కకావికలం అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన రాష్ట్రాల్లోనూ భారీగా వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోనూ గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి హుమాయూన్ సమాధి గోపురంలో కొంత భాగం కుప్పకూలిపోయింది. హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలోని చారిత్రక హుమాయూన్ సమాధి కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం రోజున మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మరో 11 మందిని శిథిలాల నుంచి కాపాడి సమీప ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. ఆ ప్రాంతానికి చేరుకుని.. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు వివరించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ఇన్వెస్టిగేటర్లు.. ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో పరిశీలించేందుకు వీలుగా ఆ దర్గా చుట్టుపక్కల మొత్తం ఢిల్లీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హుమాయూన్ సమాధి గోపురం కూలిపోవడానికి కారణాలపై విచారణ చేపట్టారు. ఇక మొఘల్ చక్రవర్తి హుమాయూన్ చనిపోయిన తర్వాత.. ఆయన భార్య హుమీదా భాను బేగం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. 1562లో ఈ సమాధి నిర్మాణ పనులను మొదలుపెట్టారు. 8 ఏళ్ల పాటు నిర్మించిన ఈ హుమాయిన్ సమాధి నిర్మాణాన్ని.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ప్రకటించడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa