ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో భాగంగా అలాస్కాలో జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల భేటీని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భేటీలో భాగంగా సాధించిన పురోగతిని అభినందిస్తున్నట్లు పేర్కొంది. శాంతి సాధన దిశగా సాగుతున్న వారి ప్రయత్నాలు ప్రశంసనీయమని తెలిపింది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa