ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని) అధ్యక్షుడిగా, సానా సతీష్ కార్యదర్శిగా ఎంపికయ్యారు.జాయింట్ సెక్రటరీగా విజయ్ కుమార్, ట్రెజరర్‌గా దండమూరి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. మొత్తం 34 సభ్యులతో కూడిన ఈ కొత్త కమిటీ 2025 నుండి 2028 వరకూ రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తుంది.ఎన్నికల ప్రక్రియలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఉపాధ్యక్ష పదవికి నరసింహారావు నామినేషన్ సకాలంలో అందకపోవడంతో అది రద్దు కాగా, ఆ స్థానానికి ఉప ఎన్నికలు సెప్టెంబర్ 16న జరగనున్నాయి.ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన కేశినేని చిన్ని చెప్పారు, వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని. మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, రాష్ట్ర ఆటగాళ్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పని చేస్తామని పేర్కొన్నారు. అలాగే, ఐపీఎల్ తరహాలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) నిర్వహిస్తామని చెప్పారు. కొత్త కమిటీ ఏసీఏ ప్రతిష్టను పెంచే విధంగా పని చేస్తుందని ఆయన తెలిపారు.కార్యదర్శి సానా సతీష్ మాట్లాడుతూ, గత 11 నెలలుగా ఎఫెక్స్ కమిటీతో కలిసి మంచి పని జరిగిందని చెప్పారు. విశాఖ స్టేడియం అభివృద్ధి, ఏపీఎల్ టోర్నీల విజయవంతమైన నిర్వహణలో భాగమయ్యామని తెలిపారు. జిల్లా అసోసియేషన్ల సంఖ్యను 20 నుంచి 40కి పెంచామని, కొంత మంది ఆటగాళ్లను ఇంగ్లాండ్‌లో శిక్షణ కోసం పంపించామని వివరించారు. రెడ్ బాల్, వైట్ బాల్ ఫార్మాట్ల వల్ల ఆటగాళ్లలో గందరగోళం ఉన్న నేపథ్యంలో, వేర్వేరు ఫార్మాట్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు.విష్ణు కుమార్ రాజు స్వచ్ఛందంగా ఎఫెక్స్ కమిటీ నుంచి తప్పుకొని విశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. వైస్ ప్రెసిడెంట్ పదవికి చివరి నిమిషంలో నామినేషన్ వేయడంతో ఆయన డిస్‌క్వాలిఫై అయ్యారని తెలిపారు. అన్ని వివాదాలను పరిష్కరించి, వివాద రహితంగా క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు.భవిష్యత్ ప్రణాళికల్లో, ఆటగాళ్లకు అదనపు కోచ్‌లను నియమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కమిటీ వెల్లడించింది. అలాగే మాజీ క్రికెటర్ ఎం.ఎస్.కె ప్రసాద్ సేవలను గుర్తించి, ఆయన కోసం ప్రత్యేక అకాడమీ స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు.ఏసీఏ కొత్త కమిటీ ఏకగ్రీవంగా ఏర్పడి, వచ్చే మూడేళ్లలో ఆంధ్ర క్రికెట్‌ను మరింత ప్రగతికి తీసుకెళ్లేందుకు ప్రతిబద్ధతతో పనిచేస్తుంది. ఏపీఎల్ టోర్నీ నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ-అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa