విశాఖలో కాల్పుల కలకలం రేగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. చిలకపేట ప్రధాన ద్వారం వద్ద చేపల రాజేష్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రాజేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనతో స్థానికులు భయాందోళన చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa