ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తవలస-కిరండోల్ మార్గంలో రైళ్లను మళ్లించారు. కొన్ని రైళ్లు రద్దు చేశారు, మరికొన్నింటిని పరిమిత దూరానికే తిప్పుతున్నారు. విశాఖ-కిరండోల్-విశాఖ ఎక్స్ ప్రెస్ ను రాయగఢ మీదుగా మళ్లించారు. విశాఖ-కిరండోల్ ప్యాసింజర్ అరకు వరకే పరిమితం చేశారు. కిరండోల్-విశాఖ ప్యాసింజర్ కొరాపుట్ వరకు పరిమితం చేశారు. రేపు విశాఖ-కిరండోల్-విశాఖ ప్యాసింజర్ రద్దు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa