శుక్రవారం ఉదయం పలమనేరు నుండి మొగిలి వైపు వెళుతున్న టాటా ఏస్ వాహనం, మొగిలి ఘాట్ సమీపంలో టేకుమంద క్రాస్ మలుపు వద్ద, తిరుపతి నుండి బెంగళూరు వెళుతున్న కియా మోటార్స్ కారును గమనించకుండా మలుపు తిరగడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, కానీ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రోడ్డును క్లియర్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa