ప్రపంచంలో అత్యధిక డౌన్‌లోడ్స్‌తో గుర్తింపు పొందిన ప్రముఖ షార్ట్ వీడియో కంటెంట్ యాప్ టిక్‌టాక్, మళ్లీ భారతదేశంలోకి అడుగుపెడుతుందా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.కొన్ని వార్తా వేదికలు "అవును" అంటున్నాయి. గతంలో ఈ యాప్ ద్వారా అనేక మంది తమ ప్రతిభను ప్రదర్శిస్తూ కాలక్షేపం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టిక్‌టాక్ తిరిగి రాబోతుందన్న వార్తలు వినిపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పటివరకు టిక్‌టాక్ సంస్థ నుంచి మాత్రం ఈ అంశంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.భారతదేశంలో షార్ట్ వీడియో యాప్స్‌కు పునాది వేసిన యాప్‌లలో టిక్‌టాక్ ప్రథమం అనే చెప్పాలి. ఇది కరోనా కాలానికి ముందే భారత మార్కెట్లోకి వచ్చి, రికార్డు స్థాయిలో యూజర్లను ఆకర్షించింది. అప్పట్లో ఈ యాప్‌కు యువతలో విపరీతమైన క్రేజ్ ఉండేది.అయితే, 2020లో కొన్ని రాజకీయ పరిణామాలు మరియు భద్రతా కారణాలతో టిక్‌టాక్‌ను భారత్‌లో నిషేధించారు. ఇప్పుడా నిషేధం ఎత్తివేయబోతున్నారా? అనే ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చేలా తాజా పరిణామాలు జరుగుతున్నాయి.ఇటీవల భారత్-చైనా సంబంధాలు కొంత మెరుగవుతున్నట్లు భావించబడుతున్న క్రమంలో, వాణిజ్య పరంగా రెండు దేశాల మధ్య పునఃప్రవేశానికి అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొందరు టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను లాగిన్ అయినట్లు చెప్పడం కూడా ఈ ఊహాగానాలకు బలమిస్తోంది.టిక్‌టాక్ బ్యాన్‌కు గల ప్రధాన కారణాలుచైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌పై అప్పట్లో యూజర్ల వ్యక్తిగత సమాచారం సురక్షితంగా లేకపోవడం, గోప్యత ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ చట్టం సెక్షన్ 69A ప్రకారం 2020లో భారత ప్రభుత్వం ఈ యాప్‌ను నిషేధించింది.అంతకు ముందు, 2019లో మద్రాస్ హైకోర్టు టిక్‌టాక్‌పై తాత్కాలికంగా స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2021లో కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను పూర్తిగా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రభుత్వ అనుమతి లేకుండా టిక్‌టాక్ మళ్లీ భారత మార్కెట్లోకి రావడం సాధ్యం కాదు. దీంతో ఈ వార్తలపై స్పష్టత రావాలంటే అధికారిక సమాచారం కోసం కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa