వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, ఈ సీజనల్ వ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది. ఇక, పిల్లల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో, వాళ్లకి వివిధ సీజనల్ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలతో బాధపడతారు. కఫం సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. పిల్లల ఊపిరితిత్తులలో, వాయునాళం దిగువ భాగంలో కఫం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
ఛాతీలో బిగుతుగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు ఇబ్బంది. ఈ సమస్య తగ్గించడానికి తల్లిదండ్రులు అనేక ప్రయత్నాలు చేస్తారు. మెడిసిన్ వేయడానికి ట్రై చేస్తారు. అయితే, చిన్న పిల్లలు మందులు మింగడానికి మొండిపట్టు పడతారు. చేదు రుచి కారణంగా వాళ్లు మందులు సరిగ్గా మింగరు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలు పోదు. అయితే, కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే పిల్లల కఫం సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఆ ఇంటి చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తమలపాకు చిట్కా
మీ చిన్నారులు కఫం సమస్యతో బాధపడుతుంటే.. దాని తొలగించడానికి తమలపాకు వాడొచ్చు. ఇందుకోసం ముందుగా తమలపాకు తీసుకోండి. ఆ ఆకును చూర్ణంలా చేయండి. ఇప్పుడు రెండు చిన్న ఏలకులను పొడిలా చేయండి. ఈ పొడిని తమలపాకు చూర్ణంతో కలపండి. దీనిని పిల్లలకు ఇస్తే కఫం సమస్య తగ్గుతుంది. అయితే, దీన్ని తీసుకోవడానికి కూడా పిల్లలు మొండికేయవచ్చు. అలాంటప్పుడు ఈ మిశ్రమంలో కాస్తా తేనె కలిపి పిల్లలకు ఇవ్వండి. ఈ పేస్టుని రెండు, మూడు రోజులు తినిపించడం ద్వారా పిల్లల ఛాతీ, గొంతులో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది.
తమలపాకు ఇలా కూడా వాడొచ్చు
పిల్లల ఛాతీలో కఫం పేరుకుపోతే.. వాళ్లు చాలా ఇబ్బందిపడతారు. రాత్రి సమయాల్లో కఫం కారణంగా సరిగ్గా నిద్రపోలేరు. ఆహారం తీసుకునే విషయంలో ఇబ్బంది పడతారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడానికి ఆవనూనెను వేడి చేయండి. కాస్తా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న ఆవనూనెను పిల్లల ఛాతీపై రాయండి. ఆ తర్వాత పెనం మీద తమలపాకును వేడి చేసి పిల్లల ఛాతీపై ఉంచండి. రాత్రంతా తమలపాకును అలాగే ఉంచండి. మూడు నాలుగు రోజులు ఈ ఇంటి చిట్కా ఫాలో అయితే ఛాతీలో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది.
వెల్లుల్లి చిట్కా
పిల్లల ఛాతీతో పాటు గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగించడంలో వెల్లుల్లి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఛాతీలోని కఫాన్ని సులభంగా తొలగిస్తుంది. దగ్గును కూడా నయం చేయడంలో సాయపడుతుంది. ఇందుకోసం రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఖాళీ కడుపుతో పిల్లలకు ఇవ్వండి. కావాలంటే ఒక స్పూన్ తేనేతో కలిపి ఈ చూర్ణం ఇవ్వచ్చు. రెండు, మూడు రోజులు ఈ చిట్కా ఫాలో అయితే పిల్లల కఫం సమస్య తొలగిపోతుంది.
పసుపు
పసుపు మన ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని ప్రభావం వేడిగా ఉంటుంది. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శ్లేష్మం పలుచబడేలా చేస్తుంది. ఇందుకోసం పచ్చి పసుపును తురిమి.. పాలలో వేసి కలిపి పిల్లలకు తాగించాలి. పసుపు పాలు తాగడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కావాలంటే పసుపు నూనెతో మసాజ్ చేయవచ్చు. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి సహాయపడతాయి. ఈ నివారణ కోసం.. ఒక పాన్ లో ఆవ లేదా కొబ్బరి నూనెను తేలికగా వేడి చేసి, దానికి చిటికెడు పసుపు కలపండి. ఇప్పుడు ఈ నూనె కొద్దిగా చల్లబడిన తర్వాత, పిల్లల ఛాతీపై సున్నితంగా అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.
ముఖ్యమైన చిట్కాలు
* నీటి కొరత వల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. శరీరంలో ఉండే విష పదార్థాలు కఫం సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. దీంతో పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అందుకే.. నీటితో పాటు, కొబ్బరి నీళ్లు, ఆరోగ్యకరమైన స్మూతీలు పిల్లలకు ఇవ్వండి. దీంతో పిల్లల్లో డీహైడ్రేషన్ సమస్య రాకుండా నివారించవచ్చు.
* ఛాతీలో కఫం పెరగడం వల్ల పిల్లలు జ్వరంతో పాటు దగ్గు, జలుబుతో ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో హ్యూమిడిఫైయర్ వాడండి. ఇంట్లో ఏ మూలలోనైనా దీన్ని అమర్చవచ్చు. దీని సాయంతో వాతావరణంలో ఉండే బ్యాక్టీరియాను సులభంగా తొలగించవచ్చు.
* పిల్లలు ఈ సీజన్‌లో బయట ఆడుకుని ఇంటికి వచ్చినప్పుడు వారి చేతుల్ని బాగా శుభ్రం చేయండి. దీనివల్ల శరీరంలోకి ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా బాగా ఆడిన తర్వాత స్నానం చేయించండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa