దసరా, దీపావళి, ఛాత్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 170 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు CPRO శ్రీధర్ తెలిపారు. సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు చర్లపల్లి-రెక్సాల్, చర్లపల్లి- తిరుపతి, చర్లపల్లి- వెలంకిణి తదితర ప్రాంతాల మధ్య ఈ రైళ్లు నడువనున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ రైళ్లను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa