వినాయక చవితి సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మండపాలకు ఉచిత విద్యుత్ వినతిపై సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ అంగీకరించారని లోకేశ్ తెలిపారు. రాబోయే దసరా ఉత్సవాలు, దుర్గమ్మ మండపాలకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa