ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేపర్ గణేశుడు.. పచ్చదనం పరిరక్షణకు పిలుపు!

national |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 12:03 AM

 వినాయక చవితి (Ganesh Chaturthi 2025) సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు ఉత్సాహంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రత్యేకంగా గణేశ విగ్రహాల ఏర్పాటుతో వీధులు, మండపాలు ఉత్సవమూద్రను సంతరించుకుంటున్నాయి.ఇక గుజరాత్‌లోని సూరత్‌లో ఏర్పాటు చేసిన ఓ వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎందుకంటే... ఆ విగ్రహాన్ని టిష్యూ పేపర్‌తో రూపొందించడం విశేషం. సర్కార్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రతిమ గుజరాత్‌లోనే అతిపెద్ద పర్యావరణహిత విగ్రహంగా గుర్తింపు పొందుతోంది.ఈ విగ్రహం ఎత్తు సుమారు 16 అడుగులు, వెడల్పు 6 అడుగులు. రూపకల్పన నుంచి ఆభరణాల వరకు ప్రతిదీ అత్యంత కచ్చితంగా రూపొందించబడింది. ఈ విగ్రహ తయారికి ముంబై నుంచి ప్రత్యేకంగా 15 మంది కళాకారులను ఆహ్వానించారు. వారంతా నెలరోజులపాటు శ్రమించి, సుమారు 350 కిలోల టిష్యూ పేపర్ వాడి ఈ శిల్పాన్ని సృష్టించారు.విగ్రహ నిమజ్జనానికి కోసం సమీపంలో ప్రత్యేకంగా ఓ తాత్కాలిక నీటి కొలను నిర్మించారు. నిమజ్జనం అనంతరం మిగిలిన టిష్యూ పేపర్ గుజ్జును కంపోస్ట్ ఎరువుగా మారుస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇది పర్యావరణ హితంగా గణేశ ఉత్సవాలను జరుపుకోవడంలో ఓ ముందడుగు అని వారు పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa