ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్’ అందించే నూతన పథకాన్ని రూపొందించింది. ఈ కార్డు ఆధార్ తరహాలో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకా ల వివరాలను కలిగి ఉంటుంది. గురువారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. క్షేత్రస్థాయి సమాచార సేకరణ ద్వారా కుటుంబాల అవసరాలను గుర్తించి, వారికి తక్కవ సమయంలో సంక్షేమ సహాయం అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ఈ ఫ్యామిలీ కార్డు పథకం ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ ఒకే చోట లభ్యం కానున్నాయి. కార్డులోని వివరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తూ, కుటుంబాలకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఈ కార్డు ఆధార్‌తో సమానంగా పనిచేస్తూ, ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేయనుంది. అంతేకాకుండా, సంక్షేమ పథకాల కోసం కుటుంబ విభజనలు జరగకుండా చూడాలని, అవసరమైతే స్కీమ్‌లను పునర్వ్యవస్థీకరించాలని సీఎం సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమీక్షలో రాష్ట్ర పాపులేషన్ పాలసీని త్వరలో ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా జనాభా నియంత్రణ, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు కృషి చేయనున్నారు. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ వ్యవస్థ రాష్ట్రంలో సంక్షేమ సేవల పంపిణీలో పారదర్శకత, వేగవంతమైన అమలును తీసుకురానుంది. ఈ పథకం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ కొత్త వ్యవస్థ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ ప్రయోజనాలను సమర్థవంతంగా అందించే లక్ష్యంతో రూపొందించబడింది. ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే సేవలు, సబ్సిడీలు, ఇతర పథకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఈ వినూత్న పథకం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సేవల డిజిటలీకరణ, పారదర్శకతలో ఒక ముందడుగుగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa