కర్ణాటకలోని యాద్గిర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని పాఠశాల వాష్‌రూమ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉండగా షాహాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి, పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa