బంగారం ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరిగి రూ.94,700కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.710 పెరిగి రూ.1,03,310 పలుకుతోంది. గత 4 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,800 పెరిగింది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో రూ.1,29,900 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa